తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ లేకపోతే ఎవరినీ పట్టించుకునే పరిస్థితి లేదు. వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసిన వారైనా సరే ఒక్క సినిమాతో వెనకబడి పోతే సదరు వ్యక్తి కెరీర్ పూర్తి గా వెనకబడి పోయినట్లే. అయితే కొంతమంది విషయంలో అదృష్టమనేది కీ ఫ్యాక్టర్ గా మారుతుంది. ఫ్లాప్ వచ్చిన కూడా వారికి అవకాశం రావడానికి ఎక్కువ సమయం పట్టదు. కొంత మంది కి హిట్ వచ్చినా కూడా సినిమా అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది .

ఆ విధంగా తెలుగులో మంచి మంచి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన సూపర్ హిట్ కొట్టినా కూడా తన తదుపరి సినిమాను ఓకే చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. తనీష్ హీరోగా నటించిన మేము వయసుకు వచ్చాం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన త్రినాధ రావు నక్కిన హీరోగా నటించిన నేను లోకల్ సినిమా తో హిట్టు అందుకున్నాడు. అంతకుముందు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన సినిమా చూపిస్త మామ సినిమాతో మాస్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో నేను లోకల్ సినిమా కూడా హిట్ సాధించాడు. ఆ తర్వాత రామ్ హీరోగా చేసిన హలో గురు ప్రేమకోసమే చిత్రం కూడా హిట్ అయ్యింది.

ఇలా వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు ప్రస్తుతం తన తదుపరి సినిమా విషయంలో జాప్యం చేస్తున్నాడు మాస్ రాజా రవితేజ కథతో ఒప్పించి దానిని సెట్స్ పైకి తీసుకు వెళ్లడం లో మరింత ఆలస్యం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళడానికి రవితేజ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: