తెలుగు లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల లో అందంతో పాటు అభినయంతో మెప్పించ గలిగే హీరోయిన్ గా పేరు పొందింది సాయి పల్లవి. మన హీరోయిన్లు తమ ఫిట్నెస్ కోసం ఎక్కువ జిమ్ లోనే ఉంటారు. ఆ ఫిట్ నెస్ చేసిన తర్వాత వారి లుక్స్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా బాడీ షేప్ కోసం, వెయిట్ లాస్ కోసం ఎక్కువగా మన హీరోయిన్లు జిమ్ సెంటర్ల పైన ఆధారపడతారు.

కానీ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం తనకి జిమ్ లోకి వెళ్లాలని ఆలోచన కూడా రాదని చెబుతున్నది. ముఖ్యంగా తనకు డాన్స్ అంటేనే పెద్ద వ్యాయామం మని చెప్పుకొస్తోంది. ఈ డాన్స్ కు మించిన వ్యాయామం ఎటువంటి జిమ్ము సెంటర్లలో దొరకదని చెప్పుకొస్తోంది. అంతే కాకుండా తను షూటింగ్ గ్యాప్ లో కూడా ఎక్కువగా డాన్స్ వేసేదట.


డాన్స్ తో పాటు మెడిటేషన్ వంటివి చేయడం కూడా  శరీరానికి చాలా అవసరం అని చెప్పుకువస్తుంది. అలాంటి చేయడం వల్లే అందంగా ఉన్నానని చెప్పుకొస్తోంది. తన శరీరంలో నుంచి చెమటలు బయటకు వచ్చేలా చేయడం వల్లే మరింత గ్లామర్ గా కనిపిస్తున్నానని చెప్పుకొస్తోంది సాయి పల్లవి. తన బాడీ ఫిట్నెస్ కోసం తక్కువగా ఉడికించిన శాఖాహారం ఆహారంగా తీసుకుంటారని చెప్పుకొస్తోంది.

ఒక అర గంట సమయంలో డాన్స్ వంటివి చేయడం వల్ల 500 క్యాలరీలు మన శరీరంలో కొవ్వు కరుగుతోందని తెలుపుతోంది. డాన్స్ చేయడం వల్ల మనిషి శరీరం ఫిట్ తో పాటు, ఒత్తిడిని కూడా పూర్తిగా దూరం చేస్తుందని తెలుపుతోంది. అయితే తన గురించి ఇలాంటి విషయాలని బయటికి తెలియ చేయడం విశేషం. అయితే ఫ్యూచర్ లో హీరోయిన్స్ ఈమెనే ఫాలో అవుతారేమో వేచి చూడాలి. తాజాగా లవ్ స్టోరీ సినిమా మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టింది ఈమేకు.

మరింత సమాచారం తెలుసుకోండి: