"భూమ్ బద్దల్" అంటూ 2020 ప్రారంభంలో అప్సరా రాణి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికి ఆ సాంగ్ శ్రోతల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది ఆంట్ అతిశయోక్తి కాదు. రవితేజ, శృతి హాసన్‌ లు జంటగా నటించిన "క్రాక్" సినిమా లోనిది ఈ సాంగ్. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇది స్పెషల్ ఐటెం సాంగ్ గా దుమ్ము రేపుతోంది. ఎస్ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాటలో నటి అప్సర రాణి డ్యాన్స్ కూడా పాటకు తగ్గట్టుగానే ఆకట్టుకుంది. రవితేజ కూడా ఈ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులతో అభిమానులతో మాస్ బీట్ స్టెప్పులు వేయించారు. టాలీవుడ్ లోని టాప్ 10 ఐటెమ్ నంబర్స్ లో ఇది కూడా స్థానం దక్కించుకుంది. ఈ పాట ఇప్పటికే రవితేజ అభిమానులతో పాటు అందర్నీ అలరించింది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ఈ సాంగ్ కు మంగ్లీ, సింహా తమ గాత్రాలను అందించారు. ఈ చిత్రం 2020 సంక్రాంతికి వెండితెరపైకి వచ్చింది. సినిమాలో రవితేజ ఆంధ్రప్రదేశ్‌ లోని ఒంగోలు పట్టణంలో పోలీస్ పాత్రలో కనిపించగా, యదార్థ సంఘటనల ఆధారంగా కమర్షియల్ అంశాలతో కూడిన "క్రాక్" రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వడమే కాకుండా మంచి బూస్ట్ ఇచ్చింది. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా "డాన్ శీను", "బలుపు" వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ల తరువాత ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. ఏదేమైనా ఈ సాంగ్ లో అప్సర రాణి అందాలు, స్టెప్పులు చూస్తే 'భూమ్ బద్దల్' అన్పించాల్సిందే ఎవరికైనా.  


ఈ చిత్రంలో రవితేజ తిరిగి ఫామ్ లోకి వచ్చారు. అలాగే గోపీచంద్ మలినేని కూడా తిరిగి వెండితెరపై దూసుకెళ్తున్నారు. ఈ సినిమా హిట్ కారణంగా రవితేజ చేతిలో వరుస సినిమాలు ఉండగా, మరోవైపు గోపీచంద్ మలినేని కూడా బాలయ్యతో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు.  మొత్తానికి ప్రేక్షకులతో పాటు మేకర్స్, రవితేజ ఈ చిత్రం హిట్ 'క్రాక్' పుట్టించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: