మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోలంతా హోస్టింగ్‌లోకి వచ్చారు. రియాలిటీ షోస్‌ చేశారు. అయితే వెంకటేశ్‌ మాత్రం ఇప్పటి వరకు టీవీ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈ సీనియర్‌ స్టార్ డైరెక్ట్‌గా ఓటీటీ కోసం ఒక వెబ్‌ సీరీస్‌ చేస్తున్నాడు. అబ్బాయి, బాబాయ్‌లు రానా, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో 'రానా నాయుడు' అనే వెబ్‌ సీరీస్ వస్తోంది. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో, కొత్త కంటెంట్‌తో సినిమాలు తీయడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటాడు. బుల్లితెరపై స్టార్‌ హోస్ట్‌గా క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సీనియర్‌ స్టార్ త్వరలోనే ఒక వెబ్‌ సీరీస్‌ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.  

ఇక నితిన్‌ బాక్సాఫీస్‌తో ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉంటాడు. అయితే కరోనా ప్రభావంతో మొదటిసారి ఒక సినిమాని ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల చేశాడు. నితిన్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన 'మ్యాస్ట్రో' మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడీ స్టార్ వెబ్‌ సీరీస్‌ కూడా చేసేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడనే ప్రచారం జోరందుకుంది. తెలుగునాట సినిమా స్టార్లు ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీకి వెళ్లేందుకు కూడా ఆలోచించేవాళ్లు. ఇమేజ్‌ తగ్గిపోతుందేమో అని దూరంగా ఉండేవాళ్లు. కానీ పాండమిక్‌ తర్వాత మొత్తం మారిపోయింది. పెరిగిన ఓటీటీ మార్కెట్లూ, ఫ్యాన్సీ రెమ్యూనరేషన్లతో మనవాళ్ల ఆలోచనలు మారిపోతున్నాయి. వెబ్‌ సీరీస్‌లకి ఓకే చెబుతున్నారు. సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్‌ కూడా వెబ్‌ సీరీస్ చేస్తున్నాడు. 'సేనాపతి' అనే సీరీస్‌తో ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాడు రాజేంద్రప్రసాద్.

సమంత, కాజల్, తమన్న లాంటి హీరోయిన్లు కూడా వెబ్‌ సీరీసులు చేశారు. సమంత 'ఫ్యామిలీమెన్2'తో హిందీ ఆడియన్స్‌కి దగ్గరైంది. అయితే తమన్న చేసిన 'నవంబర్‌ స్టోరీస్', కాజల్ 'లైవ్‌టెలికాస్ట్' సీరీసులు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే వెబ్‌సీరీసుల్లో చాలెంజింగ్‌ రోల్స్‌ చేసే అవకాశం వస్తోంది. ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం దొరుకుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: