కరోనా మహమ్మారి తగ్గుముఖం వచ్చిన తరువాత దర్శక నిర్మాతలు ఈ ఏడాది థియేటర్ లలో పలు సినిమాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన సినిమాల లో కొందరి సెలబ్రిటీలకు మంచి సక్సెస్ ను అందించింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇకపోతే ఈ 2021 సంవత్సరంలో ఏ సెలబ్రిటీలకు మంచి సక్సెస్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

 అఖిల్ అక్కినేని : ఈ ఏడాది విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అఖిల్ కు మంచి సక్సెస్ ను అందించింది.2021 దసరా స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు పూజా హెగ్డే కి, అఖిల్ కి మంచి సక్సెస్ ను అందించింది.

 వరలక్ష్మి శరత్ కుమార్ : క్రాక్ సినిమాలో లేడి విలన్ గా నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించినందుకు గాను ఆమెకు మంచి సక్సెస్ అందింది. సంక్రాంతి పండుగకు బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటనకుగాను మంచి మార్కులే కొట్టేసింది వరలక్ష్మి శరత్ కుమార్.

 ప్రగ్యా జైస్వాల్ : అఖండ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కంటే ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదు. కానీ 2021, డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్  హిట్ గా నిలిచింది.

 మాళవిక శర్మ : ఈమె మొదట మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్టు సినీమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ఏడాది రెడ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. ఇందులో టాలీవుడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడీగా నటించింది.

 మేఘా ఆకాష్ : శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజా రాజా చోర ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమా 2021, ఆగస్టు 19న రిలీజ్ అయి మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

 వీటితో పాటు ఇంకా పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది కెరీర్ లోనే ఫస్టు సక్సెస్ ని చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: