డేవిడ్ ఆండ్రూ వార్నర్.. ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆస్ట్రేలియా దేశం జాతీయ జట్టుకు మాజీ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. ఎడమ చేతి వాటం కలిగిన డేవిడ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే ఈయన సినిమాలలో వచ్చే కొన్ని గ్లింప్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిజానికి డేవిడ్ కు సినిమాలు అంటే చాలా ఆసక్తి.. ఈ కారణంగానే ఆయన సోషల్ మీడియా ద్వారా సినిమాలో వచ్చే హీరోల డైలాగులు చెబుతూ పాటలు, డాన్సులు వేస్తూ తెగ పాపులర్ అయ్యాడు.



మొన్నటికి మొన్న మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ చెప్పే ఒక డైలాగ్ కు తన ఫేస్ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలగా..అది విశేష ప్రేక్షకాదరణ లభించడం గమనార్హం. అంతే కాదు పాన్ ఇండియా సినిమా అయిన పుష్పా సినిమాలో తగ్గేదేలే అనే డైలాగుతో బాగా పాపులర్ పొందడమే కాకుండా టైటిల్ సాంగ్ కు కూడా స్టెప్పులేసి అందరినీ అలరించారు. పులి మేక పాటకు అల్లుఅర్జున్ ను మించి పోయేలా డేవిడ్ వార్నర్ స్టెప్పులేసి ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో అభిమానులతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా మా డేవిడ్ వార్నర్ అంటూ ట్వీట్ చేయడం అప్పట్లో చాలా వైరల్ గా మారింది.


ఇకపోతే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాలో ఒక సాంగ్ కి నేను డాన్స్ వేయాలా..? అంటూ అభిమానులను కోరుతున్నట్లు ఆయన ట్వీట్ చేసిన ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే సినీ ప్రేక్షకులు కూడా డేవిడ్ వార్నర్ కు బాగా అభిమానులుగా మారిపోయారు.. ఇక ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా కచ్చితంగా పుష్ప సినిమాలో మరో పాటకు మీరు డాన్స్ చేయాల్సిందేనంటూ కామెంట్లు కూడా చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: