తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒక్కరైనా సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలను అప్పట్లో స్టార్ హీరోలతో పోటీపడి తన సినిమాలను విడుదల చేస్తుండేవారు. అయితే సుమన్ కొన్ని వివాదాల్లో చిక్కుకొని పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లారు. అంతేకాదు.. కాలక్రమేణా తన హవా తగ్గిపోయి చివరకు సినిమాలకు దూరమైయ్యారు. ఆ తరువాత ఆయన ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన అది పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక ఇప్పుడు ఆయన ఇంతవరకు ఏ హీరో చేయలేని పని ఈ హీరో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అదేంటంటే.. హీరో సుమన్ భారత జవాన్ల కోసం 117 ఎకరాలు దానం చేసినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. నిజానికి ఆ భూమి ఇప్పుడు చేసింది కాదట రెండు సంవత్సరాల క్రితమే హీరో సుమన్ ఈ భూమిని జవాన్ల కోసం దానం చేశారని తెలుస్తోంది. అయితే అప్పుడు 175 ఎకరాల భూమిని దానం చేయగా కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల 117 ఎకరాలకు మాత్రమే సుమన్ పేరుమీద ఉండడంతో ఆ భూమిని మొత్తం విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.

సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను సంపాదించిన ఆస్తిలో సైనికుల కోసం భూమిని ఇవ్వడం త్యాగం అని అనుకోవడం లేదని.. కేవలం దేశాన్ని రక్షించే సైనికుల కోసం భూమిని ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాదు.. కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు సహాయం చేయాలనుకున్నప్పుడు అందరూ స్పందించి.. 2,3 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. ఆ సందర్భంలో మీడియా వాళ్లు ఏం చేస్తారో అని తనని అడిగినప్పుడు నేను మా ఇంటికి ఫోన్ చేసి అడిగాను అని పేర్కొన్నారు.

ఇక అప్పుడు తన భార్య ఈ భూమిని డొనేట్ చేద్దామని చెప్పినట్లుగా పేర్కొన్నాడు. కాగా.. ప్రస్తుతం ఈ భూమి పై కేసు నడుస్తోందని సైనికులకు దానం చేస్తానని అప్పట్లోనే తెలిపారు. అయితే అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. తన సినిమా షూటింగ్ లో చేసేటప్పుడు దేశ సైనికులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు తన కళ్లారా చూశానని అన్నారు. ఇక వారిని చూసినప్పుడు ఏదైనా చేయాలనిపిస్తుంది అందుకోసమే భూమిని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: