తాజాగా సాయి పల్లవి తో కలిసి లవ్ స్టోరీ, తండ్రితో బంగార్రాజు మూవీ లో నటించాడు నాగ చైతన్య.. ఇక రెండు సినిమాలలో డిఫరెంట్ రోల్ లో నటించాడు. ప్రస్తుతం మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కిస్తున్న  థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు.ఈ మూవీలో నాగ చైతన్య సరసన రాశికన్నా, అవికా గౌర్, మాళవిక నాయర్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రష్యా రాజధాని మాస్కోలో జరుగుతోంది. అక్కడ ఉండేటువంటి మంచు వీధుల్లో ఈ సినిమాని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడం జరుగుతోంది.


తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో ని నాగచైతన్య తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక తన లుక్స్ తో అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో ని సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ తీశారట. విభిన్నమైన కథతో డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోందట. వరుసగా లవ్ స్టోరీ సినిమాలనే నాగచైతన్య సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నాడు.. ప్రస్తుతం థాంక్యూ సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లే అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో నాగ చైతన్య.. హీరో మహేష్ బాబుకి అభిమాని గా కనిపిస్తాడు అన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి వార్తలు బాగా వినిపిస్తున్నాయి.. ఇక మహేష్ బాబు కటౌట్ కి నాగచైతన్య పాలాభిషేకం చేస్తున్నటువంటి ఒక వీడియో కూడా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి చిత్రబృందం కి అలాగే అభిమానులకు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే నాగ చైతన్య ఈ సంవత్సరమే బాలీవుడ్ కి కూడా పరిచయం కాబోతున్నాడు. బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు నాగ చైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: