ఇటీవలి కాలంలో సిద్దు శ్రీరామ్ పాడిన ప్రతి పాటా అటు సెన్సేషనల్ గానే  మారిపోతుంది అని చెప్పాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు.. ఆ పాట సిద్ శ్రీరామ్ పాడాడు అంటే ఇక అది రికార్డులు క్రియేట్ చేయడం పక్క అన్న విధంగా మారిపోయింది. ఇటీవలి కాలంలో సిద్దు శ్రీరామ్ పాడిన శ్రీవల్లి పాట భారత్లోనే కాదు విదేశాల్లో కూడా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎంతో మంది ఈ పాట పై రీల్స్ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేశారు. ఇక ఇప్పుడు కళావతి పాట కూడా ఇదే రేంజ్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.

 మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈ సినిమాలో నుంచి ఇటీవలే కళావతి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను సిద్దు శ్రీరామ్ పాడాడు. ఇక ఈ పాట ఆట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ పాట పై మహేష్ బాబు వేసిన స్టెప్స్ తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట ఇదే డాన్స్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక ఈ పాటకి డాన్స్ చేస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కళావతి పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే మహేష్ బాబు గారాలపట్టి సితార ఈ పాట పై డాన్స్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టింది. అంతేకాకుండా హీరోయిన్ కీర్తి సురేష్ సైతం ఈ పాట పై డాన్స్ చేసి ఆకట్టుకుంది.  ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం కళావతి పాట పై కాలు కదిపారు. డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి కళావతి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  సిగ్గుతో నన్ను నేనే అంటూ ఈ వీడియో కి ఒక  ట్యాగ్ కూడా జత చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇక తమను కూడా ఇంత బాగా డాన్స్ చేయగలడని ఈ వీడియో చూసిన తర్వాత అర్థం అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: