యువ హీరోలు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.సినిమా హిట్ లతో పని లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మరి కొంతమంది మాత్రం చేస్తున్న సినిమాలు అన్నీ భారీ క్రేజ్ ను అందుకోవడంతో మరో సినిమాలో నటిస్తున్నారు. అలాంటి హీరోల లో ఒకరు విశ్వక్‌ సేన్‌ ఒకరు.. మాస్ సినిమా లతో ఈ హీరో మంచి పేరును తెచ్చుకున్నాడు. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు క్లాస్ సినిమాలను కూడా చేస్తున్నారు. ఎప్పుడూ సినిమా అవ్వక ముందే మరో సినిమాలో నటిస్తూ బిజిగా ఉంటాడు..


ఇప్పుడు కూడా ఇతని చేతిలో కూడా ఆరు సినిమాలకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవలే 'పాగల్' సినిమాతో ప్రేక్షకులని పలకరించగా ఆ చిత్రం ఆశించినంత పేరును అందించలెదు.. కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమాకు సైన్ చేశాడు. ఇప్పుడు  విశ్వక్ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా విడుదల అవ్వనుంది. తాజాగా విశ్వక్ సేన్ మరో సినిమా గురించి చెప్పాడు. ఇవాళే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 'దాస్ కా ధమ్కీ' అనే మాస్ టైటిల్ తో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తుంది.


ఈ సినిమాని కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తుండగా వణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. సినిమా ఇండస్ట్రీ లోని ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. అందులో అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా ఆన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ మీదకు వెల్లనుంది. ఈ సినిమా మాస్ అండ్ రొమాంటిక్‌ ఎంటర్ టైనర్ కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే.. మరి ఈ సినిమా అన్నా హీరోకు మంచి టాక్ ను అందుకుంటుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: