టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో థమన్ పేరు ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా. అతను ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిన కూడా ఇచ్చి పడేస్తున్నాడు అని జనాలు చాలా కామెంట్ చేస్తున్నారు.

ఒకప్పుడు కాపీ ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొన్న థమన్ ఇటీవల కాలంలో మాత్రం చాలా కొత్తగా ట్రై చేసి తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నాడని తెలుస్తుంది.. ముఖ్యంగా అఖండ సినిమాతో తన స్థాయి మరింత పెరిగి పోయింది అని చెప్పవచ్చు.. ఇక రీసెంట్ రాధే శ్యామ్ సినిమా కోసం కూడా థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత క్లిక్ అయిందట.. అయితే ప్రభాస్ థమన్ కు మరొక గొప్ప ఆఫర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ప్రస్తుతం లైనప్ లో చాలా పెద్ద సినిమాలను సెట్ చేసుకున్న ప్రభాస్ ఏ దర్శకుడి సినిమాకు థమన్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అనేది ఆసక్తిగా మారిందట.. ప్రస్తుతం ఒక డైరెక్టర్ పేరు మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
 
గత కొన్నేళ్ల ముందు వరకు కూడా థమన్ ఎక్కువగా కాపీ ట్యూన్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే అతను త్రివిక్రమ్ చేతిలో పడ్డాడో కానీ అప్పటి నుంచి చాలా విభిన్నమైన మ్యూజిక్ అందించడం మొదలు పెడుతున్నాడు. సినిమాకు తగ్గట్టుగా సరిపోయే మ్యూజిక్ ను ఇవ్వడంతో ఇప్పుడు తను స్పెషలిస్ట్ గా మారిపోయాడు.. అల వైకుంఠపురములో సినిమా నుంచి అతని కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.
 

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఎక్కువగా తనకు తెలిసిన సినిమాలన్నిటికీ కూడా మొదటి ఆప్షన్ గా తమన్ సెట్ చేస్తుండడం గమనార్హం.ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం థమన్ తోనే మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడట.. థమన్ కూడా ఒకసారి పని చేస్తే మరోసారి అతనితోనే పని చేయాలి అనే విధంగా మిగతా దర్శకులు హీరోలు కూడా ఆలోచిస్తున్నారట.
 

థమన్ కూడా దర్శకులతో తన బాండింగ్ ను ఎక్కువగా పెంచుకుంటున్నాడు అనే చెప్పవచ్చు. సినిమాకు కేవలం మ్యూజిక్ అందించడం మాత్రమే కాకుండా వారితో ఎక్కువగా ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. ఇక యూవీ క్రియేషన్స్ అతనికి గతంలో భాగమతి,మహానుభావుడు అనే ఆఫర్లు ఇవ్వడం ఆయనకు మేజర్ ప్లస్ పాయింట్. అప్పుడు ఆర్థికంగా కూడా తమ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ సినిమాలు ఇచ్చి ఎంతో హెల్ప్ చేశారు అని థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
 

ఆ రుణంతోనే యు.వి.క్రియేషన్స్ లో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు థమన్ చెప్పుకొచ్చాడట.మొత్తానికి ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రభాస్ కు చాలా బాగా నచ్చేసిందట అందుకే అతనితో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.
 

మొత్తానికి థమన్ ప్రభాస్ ను కూడా బాగా ఆకర్షించేశాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం లైనప్ లో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఏదో ఒక సినిమాకు అతనికి అయితే ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఇక అందులో ఎక్కువగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే హారర్ కామెడీ సినిమాకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.. ఆ సినిమాను మరికొన్ని రోజుల్లో మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం విడుదల చేయాలని అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: