ఈ మధ్యకాలంలో సినిమా కోసం ఏదైనా చేయడానికి హీరోలు రెడీ అవుతున్నారు . సినిమాకోసం ప్రాణం పెట్టి మరి చేస్తున్నారు.క్యారెక్టర్‌ కోసం ఏం చేయడానికైనా సరే రెడీ అంటున్నారు.దాని బెస్ట్ ఎక్జాంపుల్ గా పుష్పలో అల్లు అర్జున్ అనిచెప్పుకోవచ్చు.

ఇలాంటి పాత్రలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కాని అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేస్తున్నారు మన స్టార్స్.

హీరో అంటే క్లీన్ గామరియు నీట్ గా మంచి జిమ్ బాడీతో హీరోయిజం చూపించకుంటూ హీరోయిన్ తో రోమాన్స్ చేసుకుంటూనే ఉండాలి అనే రోజులు అయితే పోయాయి.హీరోలు రఫ్ అండ్ రగ్డ్ లుక్ తోఇప్పుడు రచ్చ చేస్తున్నారు. ఎవరూ గుర్తు కూడా పట్టలేనంతగా తమను తాము మార్చుకుంటున్నారు. ఇక రీసెంట్ గా కోలీవుడ్‌ స్టార్‌ హీరొ కార్తీ కూడా ఇదే చేశాడని తెలుస్తుంది.. తమిళంలో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం కార్తి కార్తీలా లేడట.అసలు ఈ వ్యక్తి కార్తినా లేక ఎవరోనా అన్నట్టు మారి పోయాడట.. తన పాత ఛాయలు అస్సలు కనిపించకుండా మేకోవర్ అయ్యాడు యంగ్ హీరో. ప్రస్తుతం కార్తి సర్దార్‌ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కార్తి నటిస్తున్నాడట.. ఈ సినిమా కోసం కార్తి మరో ప్రయోగం కూడా చేశాడు. ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్ గా రాశీ ఖన్నా నటిస్తోందని సమాచారం..

సర్ధార్ కోసం తెగ కష్టపడుతున్న కార్తీ కంప్లీట్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడని తెలుస్తుంది.. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో వుంది.. రీసెంట్ గా ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్‌ని కూడా మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో పూర్తిగా గుర్తు పట్టకుండా ఉన్న కార్తీని చూసి నెటిజన్లు అయితే షాక్‌ అవుతున్నారు. పూర్తి మేకోవర్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడట కార్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: