సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ఈయన నటించే  ఏ సినిమా అయినా సరే కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వసూలు చేస్తూ సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడిగా అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా బిజినెస్ రంగంలో అటు వాణిజ్యపరంగా కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. అంతేకాదు తను సంపాదించిన డబ్బు లలో కొంత భాగం అనాధ పిల్లల చికిత్సకు సహాయపడుతున్నాడు.

ఇకపోతే మహేష్ బాబు తాజాగా ఒక యంగ్ హీరో కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆ హీరో ఎవరో కాదు తన మేనల్లుడు అశోక్ గల్లా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పుట్టినరోజు శుభాకాంక్షలు అశోక్ గల్లా.. మీ ప్రత్యేక రోజున మీకు అనంతమైన ఆనందం మరియు విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను.. సినిమాలలో మరింత విజయాన్ని అందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అంటూ రెండు హ్యాపీగా ఉండే ఎమోజీ లను షేర్ చేసాడు. ఇదిలా ఉండగా ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు షేర్ చేసిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అశోక్ గల్లా తాజాగా హీరో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో తన తాత కృష్ణ,  మామ మహేష్ బాబు లాగే కౌబాయ్ గా వేషం కట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు అశోక్ గల్లా. ఇక తన తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు త్వరలో ఆయన రాబోయే మరొక సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సమాజానికి ఏదైనా మంచి సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుందని అశోక్ తన పుట్టినరోజు సందర్భంగా తన మనసులో మాటలను మీడియా ముందు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: