మాస్ రాజా రవితేజ ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ ఫాస్ట్ గా ముందుకు దూసుకు పోతున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న నాలుగు సినిమాలలో ఒకటి టైగర్ నాగేశ్వరరావు. రవితేజకు మొదటి పాన్ ఇండియా సినిమాగా అభివర్ణిస్తున్న ఈ సినిమా కి వంశీ దర్శకత్వం వహిస్తుండగా స్టువర్టుపురం లో పేరుమోసిన గజదొంగ అయినా నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో చాలా మంది హీరోలు ఈ సినిమాకు సంబంధించిన కథను పరిశీలించి నో చెప్పగా రవితేజ ఫైనల్ గా ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ దర్శకుడు స్క్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి కి కూడా వినిపించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా చిరునే వెల్లడించారు. ఈ కథ తనకు చాలా బాగా నచ్చిందని కొన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని ఆయన వెల్లడించారు.  అంతేకాదు ఈ సినిమా రవితేజ హీరో అయితే సరిగ్గా సరిపోతుందని కూడా చిరంజీవి సూచించారట. ఆ విధంగా మెగాస్టార్ తన ఇమేజ్ కథ కాదని రిజెక్ట్ చేసి రవితేజకు సూచించడం పట్ల ఆయన గొప్పతనం తెలియజేస్తుంది.

అయితే మధ్యలో ఈ కథ చాలా మంది హీరోల వద్దకు వెళ్ళగా చివరకు ఈ సినిమా రవితేజ చేయడం విశేషం. చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాలు రవితేజ చేయడం నిజంగా గొప్పవిషయం అనే చెప్పాలి. రవితేజ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాడు. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ సెట్ కోసం దాదాపు 7 కోట్లకు పైగా ఖర్చు చేశారట.  ఈ చిత్రం కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కిలాడి సినిమా తో భారీ పరాజయాన్ని అందుకున్న రవితేజ ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా జూలైలో విడుదల చేయబోతున్నాడు ఈ చిత్రంతో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: