కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కేజీఎఫ్ చాప్టర్ 1" లాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ సినిమాలో హీరో యశ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రసంశలు దక్కాయి. అయితే ఈ విజయం తర్వాత దీనికి సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్. ఎన్నో అంచనాలతో రెండు వారాల క్రితం ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండి హిట్ టాక్ తో ఆర్ ఆర్ ఆర్ కు ధీటుగా వసూళ్లు సాధిస్తూ సంచలనాలు సృష్టించేందుకు తన యాత్ర కొనసాగుతోంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల పరంగా కాదు నటీనటుల పరంగాను సంచలనం సృష్టిస్తోంది. కేజీఎఫ్ చిత్ర హీరో యశ్ ఒకప్పుడు సీరియల్ నటుడు కావడం అతిపెద్ద విశేషం అనుకుంటే వరుస పెట్టి ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పాన్ ఇండియా మూవీలో గంభీరమైన విలన్ పాత్రలో గరుడగా మనల్ని ఆశ్చర్యపరిచిన నటుడు  రామరాజు హీరో యశ్ డ్రైవర్ అని, ఇదే తన మొదటి సినిమా అన్న వార్త సంచలనం సృష్టించగా ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త మన ముందుకు వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 లో పవర్ ఫుల్ ప్రధాని పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఒకప్పుడు స్టూడియోల్లో ఫ్లోర్లు తుడుస్తూ ఉండేది అని విస్తుపోయే విషయాన్ని వ్యక్తం చేశారు.  

తాను సినిమాలలోకి రాకముందు స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేసేవారట రవీనా. అయితే చాలా మంది ఈమెను చూసి నువు తెర వెనక కాదు తెర పైన ఉండాల్సిన వ్యక్తివి అంటూ ప్రోత్సహించడంతో నేడు నటిగా మీ అందరి ముందు నిలబడ్డాను అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు రవీనా టాండన్. ఈ విషయం విని అంతా షాక్ అవుతున్నారు. రవీనా టాండన్ కేజీఎఫ్ చిత్రంలో దేశ ప్రధానిగా కనిపించి హీరోకి దీటుగా యాక్ట్ చేసి మన్నలను పొందుతున్నారు. ఈ సినిమా విజయంలో ఈమెది కూడా కీలక పాత్రనే చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఎటు చూసిన కేజీఎఫ్ సినిమా మాటలే వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: