
సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తయిపోవడం తో మహేష్ బాబు కూడా రిలాక్సయిపోయారు. వెంటనే... వేసవి విడిది కోసం దుబాయ్ పయన మయ్యారు. ఆదివారం ఆయన కుటుంబంతో సహా.. దుబాయ్ విమానం ఎక్కేసినట్టు తెలుస్తోంది... కొద్ది రోజుల్లో జక్కన్న కూడా దుబాయ్ వెళుతూన్నారన్న విషయం తెలిసిందే.. అక్కడ మహేష్ తో సినిమా గురించి చర్చిస్తారని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాను వెంటనే మొదలు పెడతారని తెలుస్తుంది. ఆ సినిమా స్క్రిప్టును కూడా పూర్తీ చేసినట్లు తెలుస్తుంది.
మొన్నామధ్య త్రివిక్రమ్ కూడా మహే్‌ష ని దుబాయ్ లోనే కలిశారు. అక్కడ తన సినిమా కథ చెప్పేశారు. మే 12 న 'సర్కారు వారి పాట' విడుదల అవుతుంది. ఆ తరవాత త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లాలని మహేష్ అనుకున్నారు.. ఆ తర్వాత జక్కన్న తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారన్న విషయం పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.. రెండు మూడు కథలను అనుకున్నాడట జక్కన్న.. మరి దుబాయ్ చర్చల తర్వాత ఎటువంటి జొనర్ లో వస్తుందో తెలియనుంది..