పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ చాలా హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ విభాగంలోకి అడుగు పెట్టకూడదు అని నిర్ణయించుకున్నారు. ఇక ఆరోజు నుంచి తన కల కలలాగే మిగిలిపోయింది. అయితే రేణుదేశాయ్ తో కలిసి నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించకపోయినా ఒక మంచి లవ్ రొమాంటిక్ చిత్రంగా గుర్తుండిపోయింది. ఇక పోతే పవన్ కళ్యాణ్ నటించిన మరొక సూపర్ హిట్ చిత్రం గురించి చాలా మందికి తెలియదు. ఇక ఆ సినిమా ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన మరొక సినిమా ఖుషి.. ఈ ఖుషి సినిమాకు తమిళ డైరెక్టర్ ఎస్ జే సూర్య దర్శకుడిగా పనిచేశారు. ఇక ఈ సినిమాకి సగానికి పైగా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ప్రాముఖ్యత ఉన్న ఫైట్లు అత్యంత సూపర్ హిట్ అందుకున్న పాటలు అన్ని కూడా ఆయనే దగ్గరుండి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఎడిటింగ్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేశారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఎడిటర్ మార్తాండ్.కె.వెంకటేష్ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇకపోతే దర్శకత్వంలో ఫెయిలయ్యాడు పవన్ కళ్యాణ్ అని ఆయన అభిమానులు అందరూ నిరాశ చెందుతుంటే తాజాగా ఈ విషయం బయటకు రావడంతో ఆయన హీరోగా , దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడిగా పని చేసిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ విషయాన్ని అందుకోవడమే కాదు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: