అక్కినేని హీరో నాగ చైతన్య మజిలీ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ హిట్ ను అందుకుంది..ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫిస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నాయి.మొన్నీమధ్య వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా ఓ మాదిరి టాక్ ను అందుకుంది. ఆ సినిమా తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది. ఇప్పుడు మరో రెండు సినిమాలను చేస్తున్నాడు..తాజాగా ఈయన నటించిన థాంక్యు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


సినిమా ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని జూలై 8 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇందులో నాగచైతన్య చెప్పిన డైలాగులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ నా జీవితంలో నీకు తప్ప మరొకరికి చోటులేదు.



నా లైఫ్ లో ఎన్నో వదులుకొని ఇక్కడి వరకు వచ్చాను.. ఇక కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు..నన్ను నేను సరి చేసుకోవడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ చైతన్య చెప్పిన డైలాగ్స్ ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండడంతో ఈ డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. లవ్ ట్రాక్ రొమాంటిక్ కామెడీ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు..ఈ సినిమా ఇప్పటికే మంచి టాక్ ను అందుకుంది. అయితే సినిమాలతో పాటు వెబ్ సిరిస్ లను కూడా చెస్తున్నారు.. అవి కూడా త్వరలోనే విడుదల కానున్నాయి..మరి అవి ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: