సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడు లో ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. అయన యుక్తవయసు లో ఉన్నప్పుడు అయన సినిమా ల కోసం అభిమానులు ఎంతో ఎదురుచుసేవారు. తమిళనాట మత్రమె కాదు అన్ని భాషల్లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అలా  ఆరు పదుల వయసు దాటిన కూడా రజనీకాంత్ కు ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది అంటే ఆయన ఏ విధంగా సినిమాలను చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ రజినీకాంత్ కు మంచి సక్సెస్ రాకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

ఆయన హీరోగా తెరకెక్కిన దర్బార్ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అంతకుముందు ఆయన నటించిన కబాలి, కాలా వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అందరిని నిరాశపరిచాయి. దాంతో చాలా రోజుల నుంచి ఆయన ఎదురు చూస్తున్న హిట్ అనేది ఆయన దరికి రాకుండా పోతుంది. ఆయన తోటి సీనియర్ హీరో అయిన కమలహాసన్ ఇంకొకవైపు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంటే రజినీకాంత్ ఆ విధమైన సినిమాలను చేయకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా బాధిస్తుంది. 

ఇటీవలే కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ తరహాలో సినిమాలను దర్శకులను ఎంపిక చేసుకుని చేస్తే తప్పకుండా రజనీకాంత్ కు భారీ విజయం రావడం ఖాయం అని చెబుతున్నారు ఆయన అభిమానులు. మరి ఇప్పుడు నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి. ఇంకొకవైపు నెల్సన్ గత సినిమా బీస్ట్ తో నిరాశపరచడం రజనీ అభిమానులను కలవల పరుస్తుంది. మరి ఇన్ని పరిస్థితుల మధ్య రజనీకాంత్ చేస్తున్న ఈ సినిమా ఏ విధమైన విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: