కాజల్, ప్రభాస్ జంటగా నటించిన సూపర్ హిట్ అందుకున్న చిత్రాలలో డార్లింగ్ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రేమ కథ చిత్రంతో చాలా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది .కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా..ఆయనకు కూడా మంచి ఇమేజ్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అవ్వడమే కాకుండా అమ్మాయిలు ఆయన కోసం ఆరాటపడేవారు. ముఖ్యంగా ఈ సినిమాతోనే యువతలో బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో నటించిన నటీ నటులు  కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కు తమ్ముడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆట పట్టిస్తూ ఉండే అతడి క్యారెక్టర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఇక ఈ చిత్రంతోనే మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మార్చుకున్నాడు గౌరవ్. అయితే గౌరవ్ మొదటిసారి డాక్యుమెంటరీలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు . అంతేకాదు చిన్నప్పుడే ఎన్నో స్టేజ్ షోలలో కూడా నటించేవాడు. ఇక అలా నటనపై ఎంతో ఆసక్తి ఉన్న ఈయన సినిమాలలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటిసారి రవితేజ హీరోగా వచ్చిన బలాధూర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన గౌరవ్.. 20 సినిమాలకి పైగా నటించాడు. ఇక డార్లింగ్ సినిమా తోనే తన కేరియర్ మలుపు తిరిగింది. ఇక ఎన్నో ఆఫర్లను సైతం అందుకున్నాడు. ఇక అలాగే మహేష్ బాబు,  మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమాలో కూడా మహేష్ బాబుకి తమ్ముడిగా గౌరవ్ కనిపించిన విషయం మనకు తెలిసిందే.ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే గౌరవ్ డార్లింగ్ సినిమాకు , ఇప్పటికి చాలా మారిపోయాడు. అంతేకాకుండా తనకు హీరో అవ్వాలని కోరిక ఉందని ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామందితో తెలుపుకొచ్చాడు. మరి గౌరవ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే సక్సెస్ అవుతాడో? లేదో ?తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: