కొంతమంది దర్శకులకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో అంటే వారి సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా పెద్ద హీరోలు పిలిచి మరీ ఆ దర్శకుడికి అవకాశం ఇస్తూ ఉంటారు. అలా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా పక్కా కమర్షియల్ సినిమా కు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. సినిమా కూడా యావరేజ్ గా ఉండడంతో అందరు నిరాశగా ఉన్నారు. గోపీచంద్ అభిమానులు ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకోగా ఇది వారిని తీవ్రంగా నిరాశపరిచింది. సినిమాలో అసలు మంచి కంటెంట్ లేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం.

ఏదైతేనేం ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా పనుల్లో ఉన్నారు ఇద్దరు కూడా. గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో బిజీ గా ఉన్నాడు. మారుతీ కూడా ప్రభాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను అయన పూర్తి చేశాడని అంటున్నారు. ఈనేపథ్యంలో ఇప్పుడు సినిమా యొక్క మిగితా పనులలో అయన నిమగ్నమవబోతున్నాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుంది అంటున్నారు.ఇందులో అనుష్క, మాళవిక మోహనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

వాస్తవానికి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ తో సినిమా అంటే నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. మారుతీ కి ఈ సినిమా పెద్ద అవకాశం అని చెప్పొచ్చు. ఇది బాగా వినియోగించుకునే మారుతీ కి అగ్ర దర్శకుడిలా ఎదగడానికి మంచి విషయం. అయితే మారుతికి ప్రభాస్ సినిమా నే కాదు ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలు కూడా లైన్ లో ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే చిరు తో ఓ సినిమా ఒకే చేసుకున్నాడు. ఆ తర్వాత మరో స్టార్ హీరో తో అయన సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు? అసలు వీరు ఈయనతో సినిమా చేస్తారా అనేది ఇప్పుడు రాబోయే ప్రభాస్ సినిమా ఫలితమీదనే ఆధారపడి ఉంది. త్వరలోనే మారుతీ భవిష్యత్ తేలబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: