నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు తన కెరీర్.లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

దిల్ రాజు తన కెరీర్ లో ఎంతో మంది చిన్న చిన్న హీరోలతో సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎంతో మంది కొత్త దర్శకులను నమ్మి అవకాశాలను ఇచ్చి వారితో కూడా బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో కూడా అదిరిపోయే క్వాలిటీ కంటెంట్ సినిమాలను తెరకెక్కించి వాటితో మంచి విజయాలను అందుకని నిర్మాతగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దిల్ రాజు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా దిల్ రాజు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన జెర్సీ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగు జెర్సీ మూవీ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది. మంచి అంచనాల నడుమ విడుదలైన జెర్సీ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.

అలాగే తాజాగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన హిట్ : ది ఫస్ట్ కేస్ మూవీ విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగు హిట్ : ది ఫస్ట్ కేస్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. హిట్ : ది ఫస్ట్ కేస్ మూవీ కి నెట్ నెగటివ్ టాక్ రావడంతో పెద్దగా కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీనితో కొంత మంది బాలీవుడ్ ఇండస్ట్రీ దిల్ రాజు కి కలిసి రావడం లేదు అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: