ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల అల్లు అర్జున్‌ హీరో గా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు అన్న సంగతి తెలిసిందే.కాగా అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో ఆయనకి జోడిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మీక మందన నటించిన సంగతి తెలిసిందే.ఇక  దాంతో పుష్ప 2 ను అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఇకపోతే అందులో భాగంగానే ఆరు నెలలుగా సినిమా కు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలోనే దర్శకుడు సుకుమార్ ఉన్నాడు. కాగా సుకుమార్ ఈ క్రమంలో ఎంతో మంది తన అసిస్టెంట్స్ తో మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వారిని మరియు బాలీవుడ్‌ కు చెందిన రచయితలతో చర్చలు జరుపుతున్నాడు.ఇకపోతే  తాజాగా దర్శకుడు సుకుమార్‌ తో కలిసి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కూడా సినిమా స్క్రిప్ట్‌ వర్క్ లో పాల్గొంటున్నాడు అంటూ ఈ ఫోటో లు బయటకు వచ్చాయి.కాగా బుచ్చి బాబు ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ అయినా కూడా తదుపరి సినిమా కు స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేసి ఎన్టీఆర్ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

ఇక ఎన్టీఆర్‌ వరుస సినిమా లతో బిజీ గా ఉండటం వల్ల బుచ్చి బాబుకు ఎక్కువ సమయం లభించింది.పోతే ఈ సమయం లో గురువు సుకుమార్ తో పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్ లో బుచ్చి బాబు పాల్గొంటున్న నేపథ్యం లో ఆసక్తి మరింతగా పెరుగుతుందని కామెంట్స్‌ వస్తున్నాయి.అంతేకాదు ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల బుచ్చి బాబు పై చాలా గురి ఉంది. అయితే అందుకే తన శిష్యుడి ని పూర్తిగా సుకుమార్‌ ఇందులో ఇన్వాల్వ్‌ చేశాడు.పోతే  ఈ విషయం బన్నీ ఫ్యాన్స్ కు కూడా చాలా సంతోషకరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. కాగా సోషల్‌ మీడియా లో ప్రస్తుతం పుష్ప 2 కోసం బుచ్చి బాబు అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్‌ ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: