టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని జోడీలకు ఎప్పటికీ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా హీరో దర్శకుల మధ్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. క్రేజ్ భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి వారి సినిమాలకు కూడా అంతే రకమైన క్రేజ్ ఉంటుంది. అలా హీరో దర్శకుల బెస్ట్ కాంబినేషన్లలో ఒక కాంబినేషన్ త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్. వీరిద్దరూ కలిసి ఏ సినిమా చేసినా కూడా అది భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుంది. అనేది వారి వారి అభిమానుల అభిప్రాయం.

తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన అలా వైకుంఠపురం లో చిత్రం భారీ విజయాన్ని అందుకొ మంచి వసూలను తెచ్చిపెట్టింది. అంతేకాదు వీరిద్దరికీ ఇది మూడవ సినిమా కాగా హ్యాట్రిక్ విజయని కూడా ఈ సినిమా తెచ్చి పెట్టింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ జులాయి సినిమాతో కలసి సినిమాలు చేయడం మొదలుపెట్టారు ఆ విధంగా ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాను కూడా చేశారు ఈ రెండు చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

 మూడవ సినిమా చేయడం కోసం కొంత సమయం తీసుకున్నా కూడా అలా వైకుంఠపురం లో సినిమా భారీ సక్సెస్ను వీరికి అందించి తిరుగులేని జోడిగా చేరిపోయింది నిలిచింది. ఆ విధంగా ఇప్పుడు నాలుగో సినిమా కూడా చేయాలనే డిమాండ్ ప్రేక్షకులలో నెలకొంది వీటి కలయికలో వచ్చే క్లాస్ సినిమాలు మహా ప్రేక్షకులను కూడా భారీ స్థాయిలో ఆలదించడంతో ఈ విధమైన డిమాండ్ ఇప్పుడు ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాను చేస్తున్న త్రివిక్రమ్ ఆ తరువాత ఈ హీరోతో సినిమా చేస్తాడా అనేది చూడాలి. ఇటు అల్లు అర్జున్ కూడా సుకుమార్ పుష్ప2 సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో కలిసి సినిమా చేస్తుండగా ఆ తర్వాత ఈ దర్శకుడు తో చేసే విధంగా ఆయన ఆలోచనలు చేస్తున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: