మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం సీతారామం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ మృణాలు ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించినది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ మృణాల ఠాకూర్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఇక అలా పలు రకాల విషయాలను కూడా పంచుకుంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మృణాల్  మాట్లాడితూ.. హిందీలో కుంకుమ భాగ్య అనే సీరియల్ అన్ని భాషలలో డబ్ అయినది నాకు మంచి పేరు తెచ్చి పెట్టినది అని తెలియజేసినది. ఇక తెలుగులో కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పై హీరోయిన్గా నటిస్తాం అనుకోలేదని అందులో దుల్కర్ సల్మాన్ హీరోగా అశ్విని దత్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా తనకు ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది అని తెలియజేసింది. హిందీ జెర్సీ రీమిక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను చండీగర్లో ఉన్నాను.. ఆ సమయంలోనే హను గారు ఫోన్ చేసి మిమ్మల్ని మేము ఒకసారి కలవాలని తెలిపారుట అలా ముంబైలో కాఫీ షాప్ లో కలిసామని ఆ తర్వాత పూర్తి కథను ఆఫీసులో విన్న తర్వాత ఓకే చేశానని తెలిపింది.


అలాగే రష్మిక హీరోయిన్ గురించి కూడా మాట్లాడుతూ ఆమెలో ఎనర్జిటిక్ లెవెల్ చాలా ఎక్కువగానే ఉంటాయి ఒకరోజు ముంబై మరొక రోజు చెన్నై ఇలా పలు ప్రాంతాలకు చలాకీగా తిరుగుతూ ఉంటుంది. సెట్లో చాలా హుషారుగా ఉంటుంది.. అందర్నీ చాలా కేర్ గా చూస్తూ ఉంటుంది అని తెలియజేసింది. ముఖ్యంగా మా కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంటాయని తెలియజేసింది. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయని తెలిపింది మృణాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: