ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ప్రస్తుతం బుల్లితెరపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నవ్వులకు కేరాఫ్ అడ్రస్గా చిరునవ్వుకు చిరునామా గా మారిపోయిన జబర్దస్త్ కార్యక్రమం ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో కొంతమంది కమెడియన్స్  బయటికి రావడం కొంతమంది షాకింగ్ కామెంట్స్ చేయడం కారణంగా జబర్దస్త్ కార్యక్రమం బాగా వార్తల్లో నిలుస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన గెటప్ శ్రీను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఎప్పటిలాగానే తన కో టిమ్ మేట్ అయిన ఆటో రాంప్రసాద్ తో కలిసి స్కిట్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు శ్రీను. అయితే ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో అలరించిన అన్నపూర్ణమ్మ ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ పంచుతుంది అన్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవల విడుదలైన  ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శ్రీను చేసిన ఒక కామెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రకాష్ రాజు గెటప్ వేసిన  శ్రీను అందరిని కడుపుబ్బా నవ్వించాడు.


 ఇక ఇదే ప్రోమోలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కూడా కనిపిస్తాడు శ్రీను. ఇక తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటాడు అనే చెప్పాలి. ఇదే స్కిట్ లో ఖైదీ పాత్రలో చేస్తుంది అన్నపూర్ణమ్మ. అయితే ఈ ఎపిసోడ్లో అన్నపూర్ణమ్మ గెటప్ శ్రీను కి ఏ మాత్రం భయపడకుండా అతడి మీద సెటైర్లు వేస్తూ ఉంది. మొహం చూసి మాట్లాడు అని గెటప్ శ్రీను డైలాగ్ చెప్తే.. నీ మొహం ఎవడు చూస్తాడు చెంబట్టుకెళ్ళే మొహం నువ్వు అంటూ కౌంటర్ వేసింది. ఇక మరో సందర్భంలో శ్రీను కొట్టబోతే అన్నపూర్ణమ్మ తనదైన శైలిలో యాక్షన్ చేస్తోంది. దీంతో శ్రీను ఇన్నాళ్లు నాదే ఎక్కువ అనుకున్నా కానీ నాకన్నా ఎక్కువ అన్నపూర్ణమ్మ యాక్షన్ ఉంది అంటూ చెబుతాడు గెటప్ శ్రీను. దీంతో అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: