ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో రెండు సినిమాలు మాత్రం ఇతిహాసాల నేపథ్యంగా రూపొందించడం అభిమానులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇతిహాసాల మీద సినిమా చేయడం చాలా తక్కువ అయిన నేపథ్యంలో ప్రభాస్ ఇతిహాసాల యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా వాటిని సినిమాలుగా చేయడం నిజంగా అభినందనీయ విషయం. బాలీవుడ్ లో ఆయన రూపొందించిన ఆది పురుష్ చిత్రం రామాయణం ఆధారంగా రూపొందింది.

ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులను శెరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అప్డేట్ లకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ రాముడు గా నటిస్తూ ఉండగా సీతగా కృతీ సనన్ రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడని చెబుతున్నారు. 

ఇకపోతే భారత దేశంలో మరొక అద్భుతమైన ఇతిహాసంగా పేర్కొనబడిన మహాభారతం ఆధారంగా ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమాను చేయబోతున్నాడని అంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతూ ఉండగా ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో అమితాబ్ ఆశ్వద్ధామ గా నటిస్తూ ఉండడం అనే వార్తలు బయటకు రావడంతో ఇది మహాభారతం నేపథ్యంలో రూపొందుతుందని చెబుతున్నారు. మరి ప్రభాస్ ఎన్నో అంచనాల మధ్య చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. అసలే ఇప్పటి తరం వారికి ఇతిహాసాల విలువలు, ప్రాధాన్యత తెలియకుండా పోతున్న నేపథ్యం లో ఈ సినిమాలు ప్రభాస్ లాంటి పెద్ద హీరో చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: