బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా 80వ ఏట అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, సినీ ప్రముఖులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

కుటుంబ సభ్యులు కూడా అమితాబ్ 80వ పుట్టిన రోజు వేడులకలను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆయన మరింత ఆయురారోగ్యాలతో, సుఖః సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి  గారు నరేంద్ర మోదీ కూడా అమితాబ్ బచ్చన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరి . అదేవిధంగా అమితాబ్ ను ప్రశంసిస్తూ ఆసక్తికరమైన నోట్ ను కూడా రాశారు ప్రదాని.

ట్వీట్టర్ ద్వారా ప్రధాని మోడీ విషెస్ తెలిపారు. 'అమితాబ్ బచ్చన్ జీకి 80వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తరతరాలుగా ప్రేక్షకులను అలరించిన మరియు భారతదేశంలోని అత్యంత గొప్ప చలనచిత్ర ప్రముఖులలో ఆయన ఒకరు. ఇకపైనా ఆయన ధీర్ఘాయుస్సుతో, సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అంటూ  ఇలా విష్ చేశారు. మరోవైపు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తున్నాయి. అలాగే అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది బిగ్ బి కి .

అదేవిధంగా, శ్వేత తన తండ్రితో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు బచ్చన్ అతని తల్లిదండ్రులు, హర్వాన్ష్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లతో గడిపిన ఫోటోలను పంచుకున్నారు. ఆమె అబిదా పర్వీన్ మరియు నసీబో లాల్ 'తూ ఝూమ్' పాటతో పంచుకుంది. శ్వేత కుమార్తె నవ్య కూడా విషెస్ తెలిపింది. 'మీలాంటి వారు ఎన్నడూ సంతోషంగా ఉండాలని, ఎప్పటికీ ఉండాలని' ఆకాంక్షించింది. అమితాబ్ తన కెరీర్‌ను 1969లో 'సాత్ హిందుస్తానీ' చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత 'ఆనంద్' (1971), 'జంజీర్' (1973), దీవార్ (1975) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా 'గుడ్ బై' చిత్రంలో  అమితాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: