ఇటీవల కాలంలో ఇండస్ట్రీ లోకి వచ్చి బాగా రాణించాలి అంటే ప్రతి ఒకరికి బ్యాగ్రౌండ్ ఉండాలి.. ఇక ఎలాంటి స్టెప్ వేయాలో సూచించే గాడ్ ఫాదర్లు ఉండాలి. ఇవేవీ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా రాణిస్తాం అంటే మాత్రం కుదరని పని అన్నది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో కూడా తమ టాలెంటును నమ్ముకుని ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి ఎలాగైనా సక్సెస్ సాధిస్తామని నమ్మకంతో వచ్చి చివరికి హీరోలుగా నిలదొక్కుకున్న వారు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అని చెప్పాలి.


 షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇక సినిమాలో రాణిస్తున్న వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

 విజయ్ దేవరకొండ : పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ వరకు వెళ్లిపోయింది.. షార్ట్ ఫిలిప్స్ తో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డ విజయ్ కొంచెం టచ్ లో ఉంటాను షార్ట్ ఫిలిం ద్వారా ప్రయాణం మొదలుపెట్టాడు.

 సుహాన్ : ఇతను హీరో ఏంటి అనుకునే స్థాయి నుంచి టాలెంట్ ఉంటే ఎవరైనా హీరో కావచ్చు అని అందరికీ నిరూపించిన హీరో సుహాన్. కలర్ ఫోటో సినిమాతో కథానాయకుడుగా మారిపోయి ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి చివరికి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్నాడు అని చెప్పాలి.

 నవీన్ పోలిశెట్టి : ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నవీన్ పోలిశెట్టి పడ్డ కష్టాలు మాటల్లో చెప్పడం చాలా కష్టం. గతంలో ముంబై బెస్ట్ కామెడీ కంపెనీ ఐఏబిలో ఎన్నో వీడియోలు చేశాడు. అందులో ఇంజనీరింగ్ గురించి ఇంగ్లీషు లాంగ్వేజ్ గురించి చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.  ఇక తర్వాత సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు. హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలో నటించి మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. ఇక జాతి రత్నాలతో మరో హిట్ సాధించి బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అందుకొని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు నవీన్ పోలిశెట్టి..

మరింత సమాచారం తెలుసుకోండి: