
ఈ విధంగా ఇంతవరకు ఏ దర్శకుదు కూడా సినిమా చేయలేదని చెప్పాలి. ఒక హీరో వరుసగా రెండు సినిమాలను చేయడం ఇప్పటివరకు మనం చూసాం కానీ ఒక దర్శకుడు ఒకే సమయంలో రెండు సినిమాలను చేయడం బహుశా శంకర్ కి మాత్రమే సాధ్యం అని చెప్పాలి. ఏదేమైనా తమిళనాడు పాపులారిటీ కోల్పోయిన ఈ దర్శకుడు ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయాలనుకోవడం ఒక విధంగా ఆయన అభిమానులను సంతోష పరుస్తున్న కూడా ఇంకొక వైపు ఆయన ఫామ్ లో లేడు అన్న కలవరం మెగా అభిమానులలో నెలకొంది.
ఆ విధంగా శంకర్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకొని మళ్ళీ కం బ్యాక్ చేస్తాడో అనేది చూడాలి. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మి స్తున్న ఈ సినిమాకు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమిళ అగ్ర దర్శకుడు మరియు నటుడు ఎస్ జె సూర్య ఈ చిత్రంలో నటిస్తూ ఉండడం విశేషం.ఆ ర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఈ సినిమా తో అదే స్థాయి లో ప్రేక్షకులను అలరించాలని పెద్ద దర్శకులతో మాత్రమే చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ దర్శకుడుతో సినిమా చేస్తుండగా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు.