చిన్న చిన్న స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధా మోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడి గా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం లో ఆయన నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో సినిమ  మామూలుగా లేదు మరి .

ఈ చిత్రం టీజర్ ఎప్పుడో విడుదలైంది. 'క్రేజీ ఫెలో' టైటిల్ కి తగ్గట్టే టీజర్ లో హీరో ఆది పాత్రని చాలా క్రేజీ గా వుంది. ఆది హ్యాపీ లైఫ్ అని గడుపుతుంటాడు. అతను చేసే పనులు తనకు కావాల్సిన వారికి ఇబ్బందులను కలిగిస్తాయి అని . అతను కుటుంబానికి భారం. స్నేహితులకు, అమ్మాయిలకు ట్రబుల్ మేకర్. అతని జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు - దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ వస్తారు. క్రేజీ ఫెలోగా ఆది క్యారెక్టర్ సినిమాకు యూఎస్‌పీగా ఉండబోతోంది చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు .

ఆది స్టైలిష్ , డైనమిక్ లుక్‌ తో పాటు అతని కామిక్ టైమింగ్ ఎక్సటార్డినరీగా వుంది. సతీష్ ముత్యాల కెమెరా పనితనం  బాగా ఆకట్టుకుంది. ఆర్ఆర్ ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, టీజర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది అని మనం చెప్పవచ్చు .

సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే చిత్ర బృందం దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు ప్రకటించారు .

తారాగణం: ఆది సాయికుమార్,  గారు, అలాగే దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్

మరింత సమాచారం తెలుసుకోండి: