సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే సులభమైన విషయం కాదు అని చెప్పాలి. ఇక డైరెక్టర్ గా నిలదొక్కుకోవడానికి ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్స్ సాధించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది దర్శకులు మాత్రం కేవలం ఒకే ఒక సినిమాతో స్టార్ డైరెక్టర్లుగా మారిపోతూ ఉంటారు. ఇక అలాంటి వారి పేరు ఎప్పుడు మారుమోగిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక అలాంటి వారిలో జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా ఒకరు అని చెప్పాలి. అప్పటివరకు అనుదీప్ అంటే ఎవరికీ తెలియదు కానీ జాతి రత్నాలు అనే సినిమాతో ఒక్కసారిగా తెరమీదకి వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.


 అనుదీప్ టేకింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక జాతి రత్నాలు సూపర్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అటు తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమాను తీశాడు. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి  ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీ బిజీగా గడుపుతుంది. ఇలా ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షోలోకి చిత్ర బృందం ఎంట్రీ ఇచ్చింది.


 దర్శకుడు అనుదీప్ తో పాటు అటు హీరో శివ కార్తికేయన్ హీరోయిన్ మారియా కూడా వచ్చింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల విడుదలైన క్యాష్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఎప్పటిలాగానే అనుదీప్ తనదైన పంచులతో మరోసారి అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. అయితే హీరో శివ కార్తికేయన్ సైతం అటు అనుదీప్ తో సినిమా తీసి అనుదీప్ లాగే మారిపోయాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రోమోలో భాగంగా ఇలాంటి షోకి ఎప్పుడైనా వెళ్లారా అంటూ సుమా హీరోని అడుగుతుంది.. ఇక ఇలాంటి షోలకి ఇప్పటివరకు వెళ్లాను కాని ఇదే ఫస్ట్ టైం అంటూ పొంతనలేని సమాధానం చెబుతాడు శివ కార్తికేయన్ దీంతో అందరు నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: