సూపర్ స్టార్ రాజినికాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యనే ఐశ్వర్య, ధనుష్ విడాకులతో విడిపోయిన సంగతి మనకి తెలిసిందే మరీ

 వీరిద్దరి డివోర్స్ విషయం అభిమానులకు  అస్సలు ఊహించని షాక్ అనే చెప్పాలి మరీ . దాదాపు 17 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరూ ముగింపు పలికారు.

ఇంత దూరం ప్రయాణించాక విడిపోవాల్సిన అవసరం ఏంటి అంటూ ధనుష్ అభిమానులు  కూడా నిరాశ చెందారు కూడా. ఆల్రెడీ రజనీకాంత్ చిన్న కుమార్తె పెళ్లి పెటాకులై మరో వివాహం చేసుకుంది. ఇప్పుడు పెద్ద కుమార్తె కూడా విడాకుల బాట పట్టడంతో రజనీకాంత్ మానసిక వేదనతో ఉన్నట్లు ప్రచారం  బాగానే జరుగుతోంది మరి

ధనుష్, ఐశ్వర్యకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని తెలిసినా విషయమే . విడాకులైతే తొందరపాటుగా ప్రకటించారు. దీనితో కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి కాంప్రమైజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ధనుష్, ఐశ్వర్య తమ మనస్పర్థలు పక్కన పెట్టి విడాకులు రద్దు చేసుకునేందుకు కూడా సిద్ధం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.

 
ధనుష్ తండ్రి కస్తూరి రాజా.. విడాకుల రద్దు గురించి పరోక్షంగా మాట్లాడుతూ పిల్లల సంతోషమే తమకి ముఖ్యం అని అన్నారు మీడియా ప్రతినిధుల తో అన్నారు ఆయన . దీనితో రజనీ, ధనుష్ అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత ధనుష్, ఐశ్వర్య సరికొత్తగా కాపురం మొదలు పెట్టబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఆల్రెడీ ఐశ్వర్య కోసం ధనుష్ దాదాపు రూ100 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

 
ఈ ఇంట్లో ధనుష్, ఐశ్వర్య కొత్త కాపురం మొదలు పెట్టబోతున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ లోగా ఆ విడాకుల రద్దు వార్తని అధికారికంగా ప్రకటించాలని అభిమానులు  ఎంతో కోరుకుంటున్నారు.

 
ధనుష్ విభిన్నమైన నటనా శైలితో తమిళంలో క్రేజీ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు ఈ యువ హీరో . ధనుష్ ప్రయోగాలకి పెట్టింది పేరు. ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు ధనుష్ వెనుకాడరు అంటా మరీ . ఆ ప్రత్యేకమైన శైలే ధనుష్ ని స్టార్ హీరోగా నిలబెట్టింది అని చెప్పవచ్చు. .

మరింత సమాచారం తెలుసుకోండి: