దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసింది..ఇటీవలే జపాన్ భాషలోకి అనువదింపబడ్డ ఈ సినిమా ఈరోజు జపాన్ లో ఘనంగా విడుదలైంది..ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం అక్కడ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కూడా వారం రోజుల నుండి జపాన్ లోనే మకాం వేశారు..అక్కడి మీడియా తో ఇంటరాక్ట్ అవుతూ #RRR సినిమా గురించి విశేషాలను పంచుకున్నారు.ఇక ఈరోజు థియేటర్స్ లో విడుదల అవ్వగా #RRR టీం థియేటర్ లో ప్రేక్షకుల మధ్య సినిమా చూసారు..ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి జపాన్ లో మొదటి నుండి అద్భుతమైన క్రేజ్ ఉండడం తో వాళ్లిదరు జపాన్ లో ఏ మూలకి వెళ్లిన అభిమానుల తాకిడి తీవ్రంగా ఉంది..ఇక ఈరోజు అక్కడ విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం #RRR సినిమాకి మొదటి రోజు ఇక్కడ 8 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి అట..ఇప్పటి వరుకు ఇక్కడ విడుదలైన ఇండియన్ మూవీస్ కి మొదటి రోజు ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి ఒకసారి విశ్లేషిస్తే బాహుబలి పార్ట్ 2 సినిమాకి ఇక్కడ 1382 టిక్కెట్లు అమ్ముడుపోగా, దంగల్ సినిమాకి 1265 టిక్కెట్లు అమ్ముడుపోయాయి..ఈ రెండిటికి మించి #RRR ఈ రేంజ్ భారీ మార్జిన్ తో రికార్డు కొట్టడం అందరిని షాక్ కి గురి చేస్తుంది..ఇక వసూళ్ల పరంగా చూస్తే మన ఇండియన్ సినిమాలలో ఇక్కడ ఫుల్ రన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు సినిమాకి 400 మిలియన్ డాలర్ల వసూళ్లు రాగా, బాహుబలి 2 సినిమాకి 300 మిలియన్ డాలర్లు, బాహుబలి కి 75 మిలియన్ డాలర్లు మరియు సాహూ సినిమాకి 35 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన మగధీర సినిమాకి ఇక్క 16 మిలియన్ల డాలర్లు వసూలు వచ్చాయి..ఇప్పుడు #RRR కి కేవలం మొదటి రోజే 12 మిలియన్ల జపనీస్ డాలర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం..ఇదే ఫ్లో ని కొనాగిస్తే జపాన్ లో ఈ సినిమా ముత్తు రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: