ప్రతీ వారం జబర్థస్త్ ద్వారా కమెడియన్లు ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఈ క్రమంలో గెటప్స్ వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న గెటప్ శ్రీను ఈవారం మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ గెటప్ లో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు.
తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుల్, రాకింగ్ రాకేష్ తమ స్కిట్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక ఎప్పటిలాగే గెటప్ శ్రీను ఈవారం సరికొత్త గెటప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ గెటప్ తో శ్రీను అదరకొట్టడు. ఇక చిరంజీవి చెల్లి నయనతార పాత్రలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటించి నవ్వులు
పూయించింది. ఇక రామ్ ప్రసాద్ సత్యదేవ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ మెరిశాడు. ఈ స్కిట్ లో భాగంగా “నేను ఉన్నంతవరకు ఆ కామెడీ చైర్ కి చెద పట్టనివ్వను అంటూ చిరంజీవి స్టైల్ లో గెటప్ శ్రీను చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.ఇక ఈ స్కిట్ మొత్తం గెటప్ శ్రీను చెప్పిన డైలాగులు అన్ని చిరంజీవిని తలపించేలా ఉన్నాయి.

స్కిట్ ముగిసిన తర్వాత ఖుష్బూ మాట్లాడుతూ.. శ్రీను నడుచుకుంటూ వస్తుంటే అచ్చం మెగాస్టార్ వస్తున్నట్లు అనిపించింది… అంటూ శ్రీను యాక్టింగ్ ని మెచ్చుకున్నారు. ఇక స్కిట్ ముగిసిన తర్వాత రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి గారితో కలిసి మావాడు ప్రైవేట్ జెట్ లో వెళ్ళటంతో మా జబర్దస్త్ టీం మొత్తం వెళ్లినంత గర్వంగా ఫీల్ అయ్యాం అని ఆటో రాంప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక గెటప్ శ్రీను మాట్లాడుతూ… నేను చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే.. ఆయన భజన చేస్తున్నానని ట్రోల్ చేస్తున్నారు. ఒక భక్తుడు ఎప్పుడు దేవుడికి భజన మాత్రమే చేస్తాడు అంటూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: