జబర్దస్త్ జడ్జస్ అనే పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నాగబాబు, రోజా. ఎందుకంటే జబర్దస్త్ ప్రారంభమైన నాటి నుంచి జడ్చులుగా వ్యవహరించిన జడ్జి లుగా కూడా వారి నవ్వులతోనే కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టారు అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్లపాటు జబర్దస్త్ బాధ్యతలు  తమ భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. ఇక ఆ తర్వాత కాలంలో నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడం ఇక కొన్నేళ్లపాటు జబర్దస్త్ జడ్జిగా కొనసాగిన రోజా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ను వీడటం జరిగింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరి స్థానంలో   జబర్దస్త్ లో కొత్త జడ్జిలు ప్రత్యక్షమయ్యారు.


 ఒకప్పటి రోజ స్థానంలో ప్రస్తుతం ఇంద్రజ రెగ్యులర్ జడ్జి గా కొనసాగుతూ ఉండగా.. ఇక సెకండ్ జడ్జిగా కృష్ణ భగవాన్ అలనాటి హీరోయిన్ కుష్బూలు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇక కృష్ణ భగవాన్ జబర్దస్త్ జడ్జిగా వచ్చిన తర్వాత సినిమాల్లో మాదిరిగానే జబర్దస్త్ లో కూడా స్పాంటేనియస్ పంచలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.  అయితే గత కొంతకాలం నుంచి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న కృష్ణ భగవాన్ కు ఇక జబర్దస్త్ జడ్జి అవకాశం సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి దారులు వేస్తుందని అందరూ భావిస్తున్నారు అని చెప్పాలి.



 అయితే అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న కృష్ణభగవాన్ కి జబర్దస్త్ జడ్జిగా ఛాన్స్ ఇచ్చిన మల్లెమాల యాజమాన్యం ఇక ఆయనకు రెమ్యూనరేషన్ మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన కృష్ణ భగవాన్ కు అటు ఇంద్రజతో పోల్చి చూస్తే తక్కువ రెమ్యూనిరేషన్ ఇస్తూ చిన్న చెప్పు చూస్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంద్రజకి ఎపిసోడ్ కి లక్షన్నర ఇస్తే కృష్ణ భగవాన్ కి 70 వేల వరకు చెల్లిస్తున్నారట. తక్కువ రెమ్యూనిరేషన్కు చేయడానికి ఇష్టం లేకపోయినా ఇక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని కృష్ణ భగవాన్ జడ్జిగా కొనసాగుతున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: