మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయిన జాహ్న కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు బాలీవుడ్ మూవీ లలో నటించిన జాన్వి కపూర్ తన నటన తో ,  అంద చందాలతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం జాన్వి కపూర్ "గుడ్ లక్ జెర్రీ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. గుడ్ లక్ జెర్రీ మూవీ థియేటర్ లలో కాకుండా ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. అలాగే తాజాగా ఈ ముద్దు గుమ్మ మిలి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో జాహ్న కపూర్ ప్రస్తుతం తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో తో నటించాలని ఉంది అంటూ చెప్పు కొచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకు అందరూ ఇష్టమేనని ,  అయితే నటించే అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలని ఉంది అని జాన్వి కపూర్ తన మనసు లో మాట బయట పెట్టింది. అలాగే ఇటీ వల ఆర్ ఆర్ ఆర్ మూవీ ని చూశాను అని , ఆర్ ఆర్ ఆర్ మూవీ లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల నటన చాలా అద్భుతంగా ఉంది అని జాన్వి కపూర్ చెప్పు కొచ్చింది. ఇది ఇలా ఉంటే గతంలో కూడా జాన్వి కపూర్ టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ తో కలిసి నటించాలని ఉంది అంటూ చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: