'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్', 'ఎక్స్ ప్రెస్ రాజా' ప్రేక్షకులను అలరించిన యువ దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఆ తర్వాత 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ఎదురు దెబ్బ తిన్నాడు. మధ్యలో ఓటీటీలో 'మ్యాస్ట్రో' మూవీ ద్వారా పలకరించిన గాంధీ.. ఇప్పుడు టాలెంటెడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అనే ట్రెండీ టైటిల్ తో సినిమా తీశాడు.సినిమా ఎలా ఉందంటే.. ఈ సినిమాలో హీరో సంతోష్ శోభన్.. రఘుబాబుకు తన కథని చెబుతుంటాడు. అతను ఎక్కడ బ్రేక్ ఇచ్చినా రఘుబాబు చిరాకు పడిపోతూ చాలా టెన్షన్ గా ఉంది.. తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటాడు. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం అంత టెన్షన్ పడిపోయేంత ఉత్కంఠ ఏమీ లేదీ చిత్రంలో. ఆరంభం నుంచి గందరగోళంగా సాగే సినిమాలో కథ సరిగ్గా అర్థం కాక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది తప్ప.. ఉత్కంఠకు అవకాశమే లేదు. సీరియస్ కథను కామెడీ టోన్లో చెప్పడానికి దర్శకుడు మేర్లపాక గాంధీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టేసింది. కామెడీ పేరుతో చాలా సిల్లీగా అనిపించే సీన్లతో నింపేయడం.. కథాకథనాలు ఎంతమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'కు జనాలు లైక్ కొట్టడం కష్టమే అవుతుంది.కథతో ఏమాత్రం సంబంధం లేకుండా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అంటూ నాన్ సీరియస్ టైటిల్ పెట్టాడు.


ఈ టైటిల్ చూస్తేనే అసలిది ఫీచర్ ఫిలిమా లేక యూట్యూబ్ షార్టా అన్న సందేహం కలుగుతుంది. ఈ చిత్రాన్ని జనం అంత సీరియస్ గా తీసుకోకపోవడానికి కూడా అదే కారణం ఏమో. ఇక సినిమాను నడిపించిన విధానంలోనూ మేర్లపాక గాంధీ తాను కన్ఫ్యూజ్ అయి ప్రేక్షకులనూ కన్ఫ్యూజ్ చేశాడు. ఓపక్క నక్సలైట్లకు పోలీసులకు మధ్య వార్.. ప్రభుత్వంతో శాంతి చర్చలు.. నక్సలైట్ నాయకుల హతం.. అంటూ సీరియస్ అంశాల చుట్టూ మూల కథను రాసుకున్న గాంధీ.. ఒక వీడియో బ్లాగర్ గా హీరోను పరిచయం చేసి అతను సబ్ స్క్రైబర్లను పెంచుకోవడానికి పడే పాట్ల చుట్టూ సిల్లీ ఎపిసోడ్ ను నడిపించాడు. ఈ రెండు అంశాలు అస్సలు సింక్ కాలేదు. హీరో యూట్యూబ్ ఛానెల్ గొడవంతా ఒక చిన్న ఎపిసోడ్ కు పరిమితం. మరి దాన్ని సూచించేలా ఈ చిత్రానికి 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అనే సిల్లీ టైటిల్ అసలెందుకు పెట్టారన్నది అర్థం కాని విషయం.'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'.. 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాల్లో టిపికల్ క్యారెక్టర్ల ద్వారా.. సిచువేషన్ల ద్వారా చక్కటి కామెడీని పండించిన గాంధీ.. 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'లో ఫన్ జనరేట్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు.మొత్తానికి ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: