
అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.కానీ మరో రెండు నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న తరుణంలో ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడం ఏంటి అంటు ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. అంతేకాకుండా సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు తదితర సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆది పురుష్ సినిమా వాయిదా పడుతోంది అంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న ప్రకారం VFX నాసిరకంగా ఉండడంతో అందుకు తగినంత మెరుగులు దిద్దడానికి ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఒక కార్టూన్ సినిమా లాగా ఉందని కామెంట్లు కూడా చేయడంతో చిత్ర బృందం మంచి అవుట్ పుట్ ను తీసుకురావడం కోసం మళ్లీ విజువల్స్ మీద వర్క్ చేయడానికి సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ విఎఫ్ఎక్స్ పనుల కోసం దాదాపుగా నిర్మాతలకు రూ.100 కోట్ల అదనపు భారం పడుతోందని సమాచారం. దీంతో ఈ సినిమాకి రూ.400 కోట్ల రూపాయలకు బడ్జెట్ అయినట్లుగా సమాచారం.. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్లను రాబడుతుందా చూడాలి.