తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. సీత రామం మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.  రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  సుమంత్ , భూమిక చావ్లా ,  తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అదిరి పోయే రేంజ్ లో అలరించిన ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతుంది. సీతా రామం మూవీ సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటు వంటి స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు.

స్టార్ మా సంస్థ వారు ఈ మూవీ ని అతి త్వరలోనే తమ చానల్లో ప్రసారం చేయడానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే సీతా రామం మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్  బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: