నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అఖండ మూవీ ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ,  శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ,  దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ,  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తనకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.

మూవీ లో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ 108 వ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బాలకృష్ణ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: