టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త హీరోయిన్ ల రాక ఎక్కువైంది. దాంతో మొన్నటి దాకా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరోయిన్ లు మెలమెల్ల గా ఫేడ్ అవుట్ అయిపోతున్నారనే చెప్పాలి. అయితే వారు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమవుతూ ఉండడం వారి వారి అభిమానులు ఎంతగానో సంతోష పెడు తుంది. ఆ విధంగా అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా విడుదల అయింది. అందులో ఈ ముద్దుగుమ్మ చెఫ్ గా నటిస్తూ ఉండ గా ఈ సినిమా ద్వారా మళ్ళీ మును పటి వైభవాన్ని అందుకోవాలని ఆమె భావిస్తుంది. బాహుబలి సినిమా చేసిన తర్వాత ఎక్కువగా ప్రేక్షకులను అలరించలేకపోయింది అనుష్క. ఇక పెళ్లి చేసుకొని ఒక బాబు ను కన్నాక కూడా మళ్లీ సినిమాలలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తుంది. 

ఇక కాజల్ పెళ్లికి ముందు ఆమె చేతిలో మంచి సినిమాలే ఉన్నప్పటికీ వాటన్నిటినీ కాదని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ అవ్వడానికి సిద్ధమ వుతుంది. కమలహాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తుంది. ఇకపోతే సినిమా అవకాశాలు తగ్గటంతో బిజినెస్ రంగంలోకి వెళ్లి స్థిరపడిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమవుతుంది. అదే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తూ ఉండగా ఈ చిత్రం ఆమెకు ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ముప్పై వయసులో వీరు చేస్తున్న ఈ రీ ఎంట్రీ ఏ స్థాయి లో ప్రేక్షకులు అలరిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: