ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతగా పోటీ నెలకొందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ పోతేనే హీరోలను గుర్తు పెట్టుకుంటున్నారు మన ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఒక్క సినిమాను కూడా మొదలు పెట్టలేకపోయినా ఎన్టీఆర్ గురించి ఆయన అభిమానులు ఎంతగానో కలవరపాటు కు గురవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన తర్వాత ఈ హీరో ఏ సినిమాను కూడా మొదలు పెట్టలేకపోయాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తయి చాలా రోజులైపోయింది.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఇప్పటిదాకా తన తదుపరి సినిమాను మొదలు పెట్టకపోవడం వారిలో నిరాశ ను కలిగిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టవలసిందిగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే చాలా రోజులుగా ఈ సినిమా యొక్క ప్రారంభం వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను మొదలుపెట్టడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అనుకున్న కథను కాకుండా వేరే ఒక కథను ఈ సినిమా కోసం కొరటాల శివ సిద్ధం చేశాడట.

అందుకే ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను చేయడానికి ఆయన మరికొంత సమయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమాను ఎంత త్వరగా పూర్తిచేసి విడుదల చేయగలిగితే అంత మంచిది అని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉంది. ఆయన ప్రభాస్ నటించిన సలార్ సినిమా షూటింగ్ లో ఉండగా ఆ సినిమా పూర్తయిన తర్వాత దాదాపుగా ఎన్టీఆర్ తోనే ఆయన సినిమా చేయబోతున్నాడు అని చెబుతున్నారు. అయన తోటి హీరౌ వరుస సినిమాలను చేసుకుంటూ పోతుంటే ఎన్టీఆర్ మాత్రం ఈ విధంగా ఒక్క సినిమా ను మొదలు పెట్టడానికి ఇబ్బంది పడడం అయన అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు. ఇప్పటికైనా అయన త్వర త్వర గా సినిమాలు చేస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: