అక్కినేని సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమా ఇటీవలే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా అంత మంచి విజయం సాధించినా కూడా కలెక్షన్ల విషయంలో చిత్ర బృందం ఎంతో నిరాశ గా ఉంది. పెరిగిన ఓటీటీ కంటెంట్ వల్ల ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ఎవరు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. దాంతో ఈ సినిమాకు రావాల్సిన అనుకున్న కలెక్షన్లు రాలేదని చెప్పవచ్చు.

ఫైనల్ గా ఈ సినిమా రేపో మాపో పూర్తిస్థాయిలో థియేటర్లలో షోలను ముగించుకుంటుంది. త్వరలోనే ఓ టీ టీ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది అయితే గత కొన్ని రోజులుగా ప్రేక్షకులను ఎంతగానో కలవరపెడుతున్న విషయం సమంత  అనారోగ్యానికి గురవడం చాలా రోజులుగా చికిత్స చేయించుకుంటున్న ఈమె ఎవరిని కలవడం లేదు. ఆఖరికి యశోద సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో గాని ఆ సినిమా సెలబ్రేషన్స్ లో గాని పాల్గొనడం జరగలేదు.

 దాంతో ఈమె ఎప్పుడు బయటికి వస్తుందా అని సినిమాలు చేస్తుందా అని ఆమె అభిమానులు కలవరానికి గురవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. రౌడీ అభిమానుల సైతం ముద్దుగుమ్మ తొందరగా ఈ హీరోతో కలిసి సినిమా చేసి దాన్ని విడుదల చేయాలి అని కోరుకుంటున్నారు. ఈ సమయం లో తాను ఆనందంగా ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టడం అంతటా చర్చనీయం అయ్యింది. విడాకుల తరువాత పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె ఈ విధంగా పోస్ట్ పెట్టడం అభిమానులను సంతోషపడుతుంది అని చెబుతున్నారు. ఏదేమైనా ఆమె సంతోషాన్ని బట్టి త్వరలోనే వరుస సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది అని చెప్పాలి. మరి సమంత ఇప్పుడు చేసే సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: