యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అన్నీ కూడా పాన్ ఇండియా కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ తెరకెక్కించే ప్రతి సినిమా కూడా భారీ తారాగణంతో అంతకుమించిన బడ్జెట్తో తెరకెక్కిస్తూ భారీ వసూళ్ళను కూడా సొంతం చేసుకుంటుంది . అయితే కథపరంగా ఈ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వస్తూ ఉండడం చూసి ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శకులు సైతం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మాన్ ఇండియా చిత్రం ఆది పురుష్..

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.  కానీ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించకపోయేసరికి పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం . అందుకే ఈ సినిమాను 2023 జూన్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మిగతా వర్క్ పై బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాకు ఎక్కువగా తన సమయాన్ని కేటాయించలేదని వార్తలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి.

హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.  జగపతిబాబు, పృథ్వి రాజు సుకుమారన్, ఈశ్వరి రావ్, అభినయరాజ్ సింగ్,  మీనాక్షి చౌదరి తదితరులు కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తామని రిలీజ్ డేట్ ను కూడా చిత్ర బృందం లాక్ చేసింది . కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2024 కు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ సినిమా ఖచ్చితంగా విడుదల వాయిదా పడేటట్టు తెలుస్తోంది.  ఒకరకంగా ఈ విషయం తెలుసుకొని ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: