నటిగా మీనాది నాలుగు దశాబ్దాల ప్రస్థానం. బాలనటిగా ముప్పై చిత్రాల వరకు చేసిన మీనా 1990లో విడుదలైన నవయుగం మూవీతో హీరోయిన్ గా మారారు.సహజ నటన, పక్కింటి అమ్మాయిలా అనిపించే ముఖం, అమాయకత్వంతో కూడిన క్యూట్ నెస్ మీనాను స్టార్ చేశాయి. సౌత్ లో హీరోయిన్ గా మీనా వెలిగిపోయారు. 90లలో ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బిజీ యాక్ట్రెస్. హిందీలో కూడా ఒకటి రెండు చిత్రాలు చేశారు. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ వయసులో స్టార్ డమ్ అనుభవించారు.
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సీనియర్ హీరోల ప్రక్కన హీరోయిన్ అవకాశాలు రావడం విశేషం. మమ్ముట్టి, మోహన్ లాల్, వెంకటేష్ వంటి స్టార్స్ తో ఆమె జతకడుతున్నారు. సాఫీగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా కుదేలైంది. భర్త మరణంతో మీనా ఊహించని కుదుపుకు లోనయ్యారు.ఈ ఏడాది జూన్ 28న మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్న వయసులోనే మీనా భర్తను కోల్పోయారు.

2009లో మీనా వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక ఆరాడేళ్ల పాప ఉన్నారు. భర్త మరణంతో మీనా ఒంటరి అయ్యారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా మగ తోడు కోల్పోవడం మీనాను కుంగదీస్తాయి. చాలా రోజులు ఆమె ఒంటిరిగా ఉండిపోయారు.షూటింగ్స్ లో పాల్గొనలేదు. ఇప్పుడిప్పుడే మీనా మామూలు స్థితికి వస్తున్నారని సమాచారం. అలాగే షూటింగ్స్ లో పాల్గొంటున్నారట.ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు కాగా… రెండో వివాహం చేసుకోమని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారట. ఆడపిల్లకు మగతోడు అవసరం. కూతురు భవిష్యత్తు బాగుండాలన్నా, నీకు భర్త ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారట. మీనాకు మాత్రం రెండో వివాహం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదట. అయితే కుటుంబ సభ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారట. దీంతో మీనా ఫ్యామిలీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారనే మాట వినిపిస్తోంది . సదరు వ్యక్తి ఫ్యామిలీ ఫ్రెండ్ అట. చాలా కాలంగా మీనా కుటుంబంతో అనుబంధం ఉందట. మీనా కూతురు ఆయన్ని అంకుల్ అని పిలుస్తుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: