తెలుగు చిత్ర పరిశ్రమలో అందాలు ఆరబోస్తున్న ఆఫర్లు రావడం కష్టం.సీనియర్ హీరోయిన్ల పరిస్థితి కూడా ఇలానే మారింది. గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసినా కూడా ఛాన్సులు రాకపోవడం తో మళ్లీ తనకు అచ్చొచ్చిన దారిలోనే మహానటి అడుగులు పడుతున్నాయా.. కమర్షియల్ హీరోయిన్‌ కోణంలో కీర్తి సురేష్‌ను దర్శకులు ఎందుకు చూడలేకపోతున్నారు.. కొందరు హీరోయిన్లను కొన్ని రకాల కారెక్టర్స్‌లోనే చూడటానికి ఇష్టపడుతుంటారు ఆడియన్స్.


అందులో కీర్తి సురేష్ లాంటి ముద్దుగుమ్మ ను అయితే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలకే పరిమితం చేసారు దర్శక నిర్మాతలు. తాను అలా ఫిక్స్ కాలేదు.. గ్లామర్ షో సైతం చేస్తానంటూ సర్కారు వారి పాట కోసం అందాల గేట్లు ఓపెన్ చేసారు కీర్తికు కమర్షియల్ హీరోయిన్ అనే ట్యాగ్ మాత్రం రాలేదు. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ను గ్లామర్ యాంగిల్‌ లో చూడలేకపోతున్నారు. ఆమె కెరీర్‌కు అదే ప్లస్.. అదే మైనస్ కూడా. సావిత్రి నిజ జీవిత పాత్ర చేసాక.. కీర్తికి గ్లామర్ కారెక్టర్స్ ఇవ్వడానికి దర్శకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా లేడీ ఓరియెంటెడ్ లకే ఈమెనే ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. కానీ మహానటి తర్వాత కీర్తి నటించిన.. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఫ్లాప్ అయ్యాయి..


సర్కారు వారి పాటలో అదిరిపోయే గ్లామర్ షో చేసారు కీర్తి. అయితే దాని తర్వాత కూడా ఛాన్సులు రాకపోవడం తో. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులేస్తున్నారు ఈ భామ. తాజాగా హోంబళే ఫిల్మ్స్‌ లో రఘు తాత కు కమిటయ్యారు కీర్తి. దాంతో పాటు తమిళంలో మారి సెల్వరాజ్‌ తో మరో ఫీమేల్ సెంట్రిక్ చేస్తున్నారు. ఇక భోళా శంకర్‌లో చిరంజీవి చెల్లిగా నటిస్తున్నారు..మరి ఈమెకు మంచి అవకాశాలు వస్తాయొ రావో చుద్దాము.. టాలెంట్ ఉన్న వాళ్ళకే ఇలా అవ్వడం ఏంటో..


మరింత సమాచారం తెలుసుకోండి: