టాలీవుడ్ జక్కన్న అయిన రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరో లు గా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు.

రూ. 1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన జక్కన్న సినిమా అంతర్జాతీయ స్థాయి లో ఓ రేంజ్ హిట్ దక్కించుకుంది. అద్భుతమైన ఈ సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ మాత్రమే కాకుండా అవార్డులు మరియు అరుదైన గౌరవాలు కూడా ఎన్నో ఉన్నాయి.

సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అమెరికన్ ప్రతిష్టాత్మక అవార్డులను ఎన్నో సొంతం చేసుకున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి అవార్డుల కు నామినేట్ అవ్వడం ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని అయితే కలిగిస్తుంది.అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ సినీ అభిమాని కూడా ఈ సినిమా ఆస్కార్ నామినేట్ అయితే చూడాల ని.. అక్కడ అవార్డు దక్కించుకోవాలని ఆశ పడుతున్నారట.

కానీ అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనం లో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ దక్కించుకున్న ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడం కష్టమే అన్నట్లుగా కథనం అయితే రాసింది. కానీ ఇండియన్ సినీ పేక్షకులు మాత్రం కచ్చితం గా ఈ సినిమా ఆస్కార్ అవార్డు ను సొంతం చేసుకొని తీరుతుంది అంటూ ధీమా తో అయితే ఉన్నారు. ఇదే సమయం లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కుతుందని.. నామినేషన్స్ తోనే సరి పెట్టుకోకుండా అవార్డు ను కూడా అందుకుంటుంద ని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: