టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ వేదికపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. డార్లింగ్ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.ఇందులో ఇక కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా.. తన స్నేహితుడు అయిన గోపీచంద్‏ కూడా వచ్చారు. తొలిసారి డిజిటల్ వేదికపై అది కూడా బాలయ్యతో కలిసి డార్లింగ్ ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రభాస్ గ్లింప్స్‏కు సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గోపిచంద్ గ్లింప్స్ ని కూడా ఆహా మేకర్స్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ ను ఓ రేంజ్ లో టీజ్ చేశారు ఆయన స్నేహితుడు గోపిచంద్. డార్లింగ్‏కు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెట్టేందుకు గోపిచంద్ చాలా ప్రయత్నిస్తుండగా.. ఆపేందుకు ప్రభాస్ చాలా ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.తాజాగా విడుదలైన ప్రోమో లో ప్రభాస్ టాస్క్ ఆడుతుండగా.. వెనక నుంచి తన మిత్రుడు గోపిచంద్ ఎంట్రీ ఇచ్చారు.


ఆ తర్వాత బాలయ్యతో కలిసి గోపిచంద్ ప్రభాస్ ను ఓ ఆటాడుకున్నారు. అందులో ప్రభాస్ కు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసేందుకు గోపిచంద్ ట్రై చేయగా.. ఓరెయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ తర్వాత తన మిత్రుడు గోపిచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాల కృష్ణ గోపిచంద్ కు అడ్డుగా నిలబడ్డారు.ఇక చివరగా బాలయ్య అది ఒంగోలియన్స్ అంటూ చెప్పడం మీరు వినవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త గ్లింప్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్ ని కనుక చూస్తుంటే.. ప్రభాస్, గోపిచంద్ మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటిదో స్పష్టంగా మీకు అర్థమవుతుంది.ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్ ఇంకా ప్రాజెక్ట్ కె ల పై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: