టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు.

మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1.26 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.77 కోట్ల షేర్ ... 3.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 0.95 కోట్ల షేర్ ... 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.03 కోట్ల షేర్ ... 2.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 5 రోజులకు గాను 18 పేజెస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 6.76 కోట్ల షేర్ ... 13.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: